ప్రియమైన Guest, జ్యోతిషం చానెల్‌కు స్వాగతం
 
భారతీయ కుటుంబాలలో జరిగే అన్ని ముఖ్యమైన శుభకార్యాలు వారి యొక్క జ్యోతిష్య విశ్వాసాలపై ఆధారపడి జరుగుతాయి. ఒకే వేదికపై 'సంబంధాన్ని కుదుర్చుకోవడం' మరియు 'జాతకాలను సరి చూసుకునే' అపూర్వ అవకాశాన్ని వెబ్‌దునియా మీకు అందిస్తుంది. ఈ పోర్టల్‌కు లాగ్ ఆన్ కావడం ద్వారా ఈ సదవకాశాన్ని వినియోగించుకుని మీరు కూడా మీకు మరియు మీ కుటుంబ సభ్యుల జాతకాలకు సంబంధాలు కుదుర్చుకోవచ్చు.

 
 
Login ID:
Password:
 
ప్రస్తుతం ఈ సౌలభ్యం కేవలం భారతీయ నగరాలకు మాత్రమే అందుబాటులో ఉంది. అంతర్జాతీయ నగరాలకు ఇది త్వరలో అందుబాటులోకి వస్తుంది.
 
కార్తీకమాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి శివకేశవులను పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఈ మాసంలో చేసే పూజలు, అభిషేకాలకు విశేష ఫలితాలు లభిస్తాయి. అంతేగాకుండా కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో జరిపే సేవల్లో 'జ్వాలాతోరణోత్సవం' మరింత విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. జ్వాలాతోరణోత్సవం ... త్రిపురాసుల సంహారంతో ముడిపడినదిగా చెప్పబడుతోంది. వరగర్వితులైన త్రిపురాసురులు తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ సాధుసజ్జనులను అనేక విధాలుగా హింసించసాగారు. త్రిపురాసురుల ఆగడాలు తెలుసుకున్న పరమశివుడు, లోకకల్యాణం కోసం వాళ్లను సంహరించడానికి రంగంలోకి దిగుతాడు. అలా ఆయన త్రిపురాసురులను సంహరించినది కార్తీక పౌర్ణమి రోజునే. అందుకే దీనిని 'త్రిపుర పౌర్ణమి'గా కూడా పిలుస్తుంటారు. సాధారణంగా ఏదైనా విజయాన్ని సాధించినవాళ్లు అనేకమంది దృష్టిని ఆకర్షిస్తుంటారు. అందువలన వాళ్లకి దిష్టి తగులుతుంటుంది. ఈ కారణంగానే వాళ్లు ఇంటికి తిరిగిరాగానే దిష్టి తీయడం జరుగుతూ ఉంటుంది. అలా త్రిపురాసురులను సంహరించి విజయంతో తిరిగివచ్చిన పరమశివుడికి దిష్టి తగలకుండా ఉండటం కోసం పార్వతీదేవి జ్వాలాతోరణోత్సవం
 
కలశానికి ఉపయోగించిన కొబ్బరికాయను ప్రవాహంలో నిమజ్జనం చేయవచ్చునని, ఒకవేళ అది కష్టమైతే దగ్గర్లోని ఏదైనా జలాశయంలో నిమజ్జనం చేయవచ్చు. లేదంటే నోములు - వ్రతాల సమయంలో పీఠంపై గల బియ్యం బ్రాహ్మణులకు ఇస్తూ వుంటారు గనుక, వాటితో పాటు కొబ్బరికాయను కూడా ఇవ్వడం వలన ఎలాంటి దోషం ఉండదని పండితులు చెబుతున్నారు. నోములు - వ్రతాలు వంటి పూజా కార్యక్రమాల్లోనూ, దేవాలయాల్లో జరిగే దైవ కార్యాలలోను కలశారాధన జరుగుతూ వుంటుంది. రాగిచెంబు లేదా వెండి చెంబును కలశంగా వుంచి, దానికి పసుపు - కుంకుమలు పెడతారు. ఆ కలశంలో కొంత నీరు పోసి అక్షింతలు, పసుపు, కుంకుమలు, గంధం, పూలు వేస్తారు. కలశంపై మావిడి ఆకులు చుట్టూ ఉండేలా పెట్టి, వాటిపై కొబ్బరికాయను ఉంచుతారు. కొబ్బరికాయకు వస్త్రం చుట్టి పూజిస్తారు. ఇక పూజ అయిన తరువాత ఈ కొబ్బరికాయను ఏం చేయాలనే సందేహం చాలా మందికి కలుగుతూ వుంటుంది. అదే దేవాలయాల్లో అయితే ఇలా కలశానికి ఉపయోగించిన కొబ్బరి కాయలను 'పూర్ణాహుతి'కి వాడుతుంటారు. ఇళ్లలో వాడిన కొబ్బరిని బ్రాహ్మణులకు ఇవ్వడం నీళ్ళల్లో నిమజ్జనం చేయడం చేయాలని పండితులు చెబుతున్నారు.