మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ట, దూ, ఞ, ఝ, థా, దే, దో, చా, చీ అను అక్షరములు పేరుకు ముందు వచ్చిన మీనరాశి వారగుదురు.
ఆదాయం: 11, వ్యయం: 5, రాజపూజ్యం: 2, అవమానం: 4
ఈ రాశి వారికి ఏప్రిల్ 22 వరకు వ్యయం నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా జన్మం నందు, ఈ సంవత్సరం అంతా సప్తమం నందు శని, భాగ్యము నందు రాహువు, చతుర్థం నందు కేతువు సంచరిస్తారు. మీ గోచారం పరిశీలించగా "ఉత్తమం స్వార్జితం" అన్న వాస్తవాన్ని గ్రహించి కష్టార్జితం పట్ల ఏకాగ్రత వహింతి అభివృద్ధి చెందుతారు. అయితే కొన్ని సందర్భాల్లో ధనం ఎంత వ్యయం చేసినా ఫలితం సామాన్యంగానే ఉంటుంది. శుభకార్యాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. బంధుమిత్రుల తాకిడి అధికంగా ఉంటుంది. కొంతమందికి ధనసహాయం చేసి ఇబ్బందులెదుర్కొంటారు. స్త్రీ పురుషులకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. తరచు వైద్య సలహాలు, ఔష సేవనం తప్పవు. దంపతుల మధ్య అవగాహన లోపం, కలహాలు, అలకలు వంటి చికాకులు చోటు చేసుకుంటాయి. అయితే ద్వితీయార్థం కొంత మెరుగ్గానే ఉంటుందని చెప్పవచ్చు. పెద్దల నుంచి ఆస్తులు సంక్రమించే అవకాశం ఉంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, ఉద్యోగవకాశాలు లభించడం లేక ఏదో ఒక ఉపాధి పథకంలో స్థిరపడే ఆస్కారం ఉంది. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. అయితే నష్టాలు మాత్రం ఉండవు. నూతన వ్యాపారాలు, వ్యాపారాల విస్తరణలు అనుకూలిస్తాయి. భాగస్వామికులతో విభేదాలు తలెత్తుతాయి. అవగాహన లోపం, మధ్యవర్తిత్వాల వల్ల ఇబ్బందులెదుర్కుంటారు. వీరికి ప్రమోషన్‌తో పాటు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే సూచనలున్నాయి. ఉన్నతాధికారులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. తీర్థయాత్రలు, నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. అవివాహితులకు శుభప్రదం. నూతన దంపతులకు సంతాన ప్రాప్తి, కోర్టు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులు ఎంత శ్రమించినా సామాన్య ఫలితాలే ఉంటాయి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తుల వారికి శ్రమాధిక్యత, ఆదాయం అసంతృప్తికరంగా ఉంటుంది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల వారికి సామాన్యం. తోటల రంగాల వారికి పురోభివృద్ధి. తోటల వల్ల గత సంవత్సరం సంభవించిన నష్టాలను ఈ ఏడాది పూడ్చుకోగల్గుతారు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆటుపోట్లు తప్పవు. మొత్తంమ్మీద ఈ రాశివారికి శుభాశుభ మిశ్రమాలుగా ఉంటుంది.