ప్రధాన పేజి దినఫలం (Daily Prediction)
31 అక్టోబర్ 2014
దినఫలం
 
ఆర్థిక విషయాలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తారు. చిన్న చిన్న విధులను సైతం ఎక్కువ శ్రద్దతో నిర్వర్తించే ప్రయత్నం చేయకండి. రాజకీయరంగంలోని వారికి రహస్యపు విరోధులు అధికమవుతున్నారు గమనించండి. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.
 
 
భాగస్వాముల మధ్య అసందర్భపు మాటలు తలెత్తె అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. అనుకున్నవి సాధించి, ఎనలేని తృప్తిని పొందుతారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడితప్పదు. మీరు చేసే పనులపై ఇతరుల దృష్టి ఉంటుంది. జాగ్రత్త వహించండి. స్పెక్యులేషన్ కలసిరాదు.
 
 
ఉపాధ్యాయులకు పని భారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. అర్ధంతరంగా నిలిపివేసిన పనులు పున:ప్రారంభిస్తారు. ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగును. బంగారు, వెండి, వ్యాపారులకు లాభదాయకం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.
 
 
కర్కాటకం
పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. నూతన దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తారు. పన్నులు, వడ్డీలు, పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీలు లాభిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
 
ఉద్యోగస్తులు తలకు మించిన భాద్యతలతో తలమునకలౌతుంటే కాస్త ఓప్పిగా వ్యవహరించండి. ప్రతీ విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. స్టేషనరీ ప్రింటింగ్ రంగాలవారికి శుభం చేకూరుతుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
 
 
వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకావాలనే స్త్రీల కోరికలు నెరవేరగలవు. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరగటంతో అదనపు రాబడికై యత్నిస్తారు. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. బిల్లులు చెల్లిస్తారు.
 
 
ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. బంధువుల నుంచి ఒత్తిడి మొహమాటాలు ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్ రంగాల వారికి నిరుత్సాహం తప్పదు. ప్రయాణాలలో చికాకులు తప్పవు.
 
 
వృశ్చికం
దనియాలు, ఆవాలు, పసుపు, నూనె వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అనుకూలంగా వుండగలదు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయటం వలన అశాంతికి లోనవుతారు. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి.
 
 
రావలసిన ధనం అందటంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చేతివృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. ఏదో సాధించలేకపోయామన్న భావం మిమ్నల్ని వెన్నాడుతుంది. స్థిరాస్తిని అమర్చుకుంటారు.
 
 
మీ సంతానం పై చదువులు, విద్య, వివాహ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. బంధువుల రాక వలన ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. దీర్ఘకాలిక వ్యాధులు క్రమంగా నయమవుతాయి. మీ శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగల్గుతారు. ప్రభుత్వ అధికారుల హోదా పెరిగే సూచనలున్నాయి.
 
 
ఉద్యోగస్తులకు ప్రమోషన్‌తో పాటు బదిలీ అయ్యే ఆస్కారం ఉంది. మీ ప్రమేయం లేకున్నా కొన్ని తప్పిదాలకు మీరు బాధ్యత వహించవలసి ఉంటుంది. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్ధంగా నిర్వహిస్తారు. గృహ మార్పు వల్ల ప్రశాంతత చేకూరుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
 
పత్రికా సిబ్బందికి బాధ్యతల మార్పు, ఆకస్మిక స్థానచలనం వంటి పరిణామాలున్నాయి. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న దక్కించుకుంటారు. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఒక స్థిరాస్తి విక్రయించాలనే మీ ఆలోచన విరమించుకోవటం శ్రేయస్కరం.