కేతుగ్రహ నక్షత్రమైన మఖలో పుట్టిన జాతకులు ప్రతి విషయాన్ని అతి జాగ్రత్తగా పరిశీలిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ముందు వెనుక ఆలోచిస్తారు. ఇతరులకు ఎప్పుడూ మంచి విషయాలను నూరి పోస్తుంటారు. పొదుపు, జీవితం పట్ల అభద్రతాభావం ఉంటుంది.
జీవితంలో ఎలాంటి లోటు వీరికుండదు. మంచి మనుషులుగా పేరుతెచ్చుకునే ఈ నక్షత్ర జాతకులు సౌమ్యులుగా ఉంటారు. వీరికి గృహోపయోగం, విదేశీయాన యోగం మొదలైనవి కలిసి వస్తాయి. స్పెక్యులేషన్ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉంటే ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారని జోతిష్య నిపుణులు అంటున్నారు.
|
|
అలంకరణ ఆడవారి జన్మహక్కు. కొత్త డ్రెస్‌లు కొత్త నగలను ఇష్టపడని వారుండరు. అయితే వారి వారి జన్మరాశులను బట్టి ఫ్యాషన్ అభిరుచులు కూడా మారుతాయి. ఉదాహరణకు మేషరాశి వారి విషయాన్నే చూస్తే...
ఈ రాశివారిది ఫ్యాషన్‌లో ప్రత్యేకం. ఏ కొత్త ఫ్యాషన్ అయినా వీరితో ఆరంభం కావాల్సిందే. మిగిలిన ఆడవారికి వీరి ఫ్యాషన్ ఆదర్శమవుతుంది. నలుగురిలో కొట్టొచ్చినట్లు కనబడాలనే కోరిక వీరికి బాగా ఎక్కువ. అందుకే కొత్త కొత్త ఫ్యాషన్ సామగ్రికోసం వెతుక్కుని మరీ సేకరిస్తారు.
కొత్త అలంకరణ వస్తువులు ధరించడానికి ఏ మాత్రం సంశయించరు. అప్పుడప్పుడు వీరి ఫ్యాషన్, హద్దులు దాటి ఇతరుల వ్యతిరేక వ్యాఖ్యానాలకు గురవుతుంటుంది.
|